కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి బదిలీ అయ్యారు. ఆమెను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషాంతి బదిలీతో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆమె స్థానంలో ఇంఛార్జ్ జేసీగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.