ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని గురుకుల సంక్షేమ బాలికల హాస్టల్‌ను నిన్న అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఆహార నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను ఆయన పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.