అన్నమయ్య: మదనపల్లెలో టూటౌన్ పోలీసులు కిలాడీ బైక్ దొంగను అరెస్ట్ చేసి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. లక్కిరెడ్డిపల్లెకు చెందిన మల్లికార్జున అనే నిందితుడు రాయలసీమ వ్యాప్తంగా బస్టాండ్లు, ఆసుపత్రుల వద్ద బైక్లు దొంగిలిస్తూ వచ్చాడు. మొత్తం రూ.4.61 లక్షల విలువైన వాహనాలు పట్టుబడినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. ప్రజలు వాహన భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.