SKLM: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందజేశారు. మంత్రి ప్రజలు నుంచి ఆర్జీలు స్వీకరించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.