KRNL: ఓర్వకల్లు మండలంలోని కొమ్ముచెరువు అంజన్న ఆలయం వద్ద శివన్న (57) చెట్టుకు ఉరి వేసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు . స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా లేక ఆత్మహత్యా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు.