ELR: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (మీకోసంలో) అందిన అర్జీల పరిష్కారం జవాబుదారీతనంతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 207 ధరఖాస్తులు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.