TG: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు. మైక్రోసాఫ్ హైదరాబాద్ కేంద్రంలో 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరగగా ఆ పురోగతిపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీ, AI సిటీల నిర్మాణంపై సీఎం రేవంత్ సత్య నాదెళ్లకు వివరించినట్లు సమాచారం.