దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో మరో అంశం బయటకు వచ్చింది. రన్ వే చివర కాంక్రీట్ గోడ ఉండటం వల్లే అందరూ చనిపోయారని నిపుణులు అంటున్నారు. ఆ గోడ లేకపోతే.. కంచెను దాటుకొని విమానం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగేదన్నారు. దీంతో అసలు ప్రాణ నష్టం ఉండేది కాదన్నారు. కాగా, రన్ వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందనే వార్తలను అధికారులు ఖండిస్తున్నారు.