AP: రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ ఛేంజర్ అన్నారు. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్ట్‌లను టీడీపీనే ప్రారంభించిందని చెప్పారు. తెలుగు గంగ ద్వారా నీళ్లు తెచ్చింది టీడీపీనేనని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు లేని కారణంగా ఉత్తరాంధ్రలో నీటి సమస్య తలెత్తుతుందని వెల్లడించారు.