PPM: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగకల్పనలో భాగంగా జనవరి 5న సాలూరులో మెగా జాబ్ మేళా జరగనున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఆమె క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా పోస్టరును ఇతర అధికారులతో కలిసి సోమవారం విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తుందన్నారు.