ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి నూజివీడు డీఎస్పీ కెవివిఎన్‌వి ప్రసాద్ 35 ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పై చట్ట ప్రకారం త్వరితగతిన పరిష్కారం చేయాలని సంబంధిత పోలీసు అధికారులకి సూచించారు. సైబర్ నేరగాళ్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా స్మార్ట్‌గా వ్యవహరించాలన్నారు.