AP: రాష్ట్రంలో ఓ వైపు తుఫాన్లు, మరోవైపు కరువు అని సీఎం చంద్రబాబు అన్నారు. కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉందని చెప్పారు. ఈ ఏడాది 4,114 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని తెలిపారు. నదుల అనుసంధానం చేయగలిగితే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్‌ను నాగావళి, వంశధారకు అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.