KRNL: గాజులదిన్నె ప్రాజెక్టులో కేవలం 2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుస్తోందని కోడుమూరు జడ్పీటీసీ రఘునాథ్ రెడ్డి అన్నారు. కర్నూలులో సంఘు స్థాయి సమావేశంలో ప్రస్తుతం హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రోజుకు 200 క్యూసెక్కుల నీటిని జీడీపీకి వదులుతున్నామనే ఇరిగేషన్ అధికారుల సమాధానంతో అసహనం వ్యక్తం చేశారు. ఇలా అయితే వేసవిలో కోడుమూరుకు తాగునీటి కష్టాలు తప్పవని అన్నారు.