ATP: గుంతకల్లు మండలంలో పాత కొత్త చెరువులో సురేఖ అనే మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే ఆమెను తన భర్తే హత్య చేశాడని పోలీసుల ముందు ఒప్పుకోగా.. అతనితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేఖ భర్త రఘు రాముడు, రామ్మోహన్, షేక్ మస్తాన్ వలి కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు తెలిపారు.