ప్రో కబడ్డీ సీజన్-11 పూణేలోని చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ పై హర్యానా స్టీలర్స్ 32-23 పాయింట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ నుంచి శివమ్ పటారే(9) పాయింట్స్ సాధించి తన జట్టును విజయం వైపుకు నడిపించాడు. దీంతో హర్యానా.. సీజన్-11 ఛాంపియన్స్‌గా నిలిచింది.