బీహార్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 13న నిర్వహించిన 70వ BPSC ప్రిలిమనరీ పరీక్ష పేపర్ లీకైందని, పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. CM నితీష్‌కుమార్‌తో భేటీ అయ్యేందుకు పలువురు అభ్యర్థులు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో నిరసన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.