NGKL: జిల్లాలో 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో నేరాల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను ఎస్పీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు నివారించడం, సైబర్ నేరాలు అరికట్టడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు ఎస్పీ తెలిపారు.