KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.