ELR: ఉంగుటూరు గ్రామంలో రావిపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. వెంటనే ఇంట్లో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ఇంట్లో వాళ్లు సురక్షితంగా తప్పించుకున్నారు. పెంకుటిల్లు స్వల్పంగా దగ్ధమైంది. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.