టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు. ఓవరాల్‌గా నాలుగో పేసర్‌గా బుమ్రా నిలిచాడు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు. కెరీర్లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200+ వికెట్ల మార్క్‌ను అందుకొన్నాడు.