ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని అనంతపురం రోడ్డులో రెండు వేరువేరు ప్రాంతాలలో సత్యసాయి తాగునీటి పైప్ లైన్ డ్యామేజీ అయింది. దీంతో నీరంతా వృథాగా పోవడంతో మున్సిపాలిటీకి నీటి సరఫరా నిలిచిపోయింది. కమిషనర్ జబ్బార్ మియా స్పందించి వాటర్ వర్క్స్ సిబ్బంది చేత ప్రాతిపదికను పైప్ లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఈ మేరకు మరమ్మతు పనులను కమిషనర్ పర్యవేక్షించారు.