ATP: పోలీస్ స్టేషన్లోనే లాయర్ కుప్పకూలి శనివారం రాత్రి మృతి చెందాడు. ఆస్తి వివాదంపై లాయర్ శేషాద్రిని పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించారు. సీఐ శాంతిలాల్ ఛాంబర్లో మాట్లాడుతుండగా కుప్పకూలి మృతిచెందినట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. విచారణకు పిలిచి కానిస్టేబుళ్లు, సీఐ కఠినంగా వ్యవహరించారని, తీవ్ర ఒత్తిడికిలోనై శేషాద్రి మరణించినట్లు తెలుస్తోంది.