దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 62కు చేరింది. విమానం బ్యాంకాక్ నుంచి ముయాన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయంలోని రన్‌వేపై విమానం అదుపు తప్పి గోడను బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు సహా ఆరుగురు సిబ్బంది ఉన్నారు.