NDL: నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31వ తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమానికి వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు.