NLG: ప్రకాశం బజార్ నుంచి కలెక్టరేట్ వెళ్లే రహదారి మొత్తం గుంతల మయమై ప్రమాదకరంగా మారిందని వాహనదారులు అంటున్నారు. ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్డు ఇలా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.