ATP: తాడిపత్రి పట్టణ ఎస్సై నాగవీరయ్య ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎస్సై నాగ వీరయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1985లో కానిస్టేబుల్ గా బాధ్యతలు చేపట్టి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ప్రస్తుతం ఎస్సైగా నాగ వీరయ్య విధులు నిర్వహిస్తున్నారు. మృతుని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.