దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. విమానంలో ప్రయాణించిన మొత్తం 175 మంది ప్రయాణికులు సహా నలుగురు సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇద్దరు సిబ్బంది మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు.