SKLM: నేటి సమాజంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై యువత ఆసక్తి కనబరిస్తున్నారని ఇది ఎంతో ప్రమాదకరమని ఈగల్ టీం సభ్యులు తెలిపారు. సోమవారం జలుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్య వినియోగం పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరదాగా ప్రారంభమైన ఈ అలవాటు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని సూచించారు.