NTR: అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అర్జీలకు పరిష్కరం చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎటువంటి అలసత్వం ప్రదర్శించిన ఉపేక్షించే ప్రశక్తే లేదని హెచ్చరించారు.