KRNL: ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నందవరంలో నూతనంగా నిర్మించిన సహకార సొసైటీ గోదాంను ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఎమ్మిగనూరులో ఇంటింటికి త్రాగునీరు అందిస్తామన్నారు.