KRNL: ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన ఆరుగురికి సోమవారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గ ఇంఛార్జ్ వీరభద్ర గౌడ్ అందజేశారు. రూ. 5,13,904 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా ఉంటుందని తెలిపారు.