KDP: ప్రజలపై విద్యుత్ భారాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం బద్వేలు పట్టణంలో సీపీఎం పట్టణ కార్యదర్శి శీను అధ్యక్షతన ప్రాంతీయ సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ దారిలోనే కూటమి ప్రభుత్వం నడుస్తుందని పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలన్నారు.