KDP: విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు రాహుల్ డిమాండ్ చేశారు. SFI కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకు వినతిపత్రం అందించారు.