KDP: చింతకొమ్మదిన్నె మండలం అప్పరాజు పల్లెలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద శ్రావణమాసం సందర్భంగా ఈనెల 26న వృషభరాశులచే బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.40 వేలు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇలా ఏడు బహుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. పోటీలలో పాల్గొనేవారు రూ.500 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.