W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలకు పాత పద్ధతిలోనే బియ్యం, పప్పు, ఆయిల్ సరుకులు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేసి, సీడీపీవో విజయరత్నంకు వినతి పత్రం సమర్పించారు. సరుకులు ఎస్ఆర్ఎస్ పద్ధతిలో ఇవ్వాలని చేస్తున్న ఒత్తిడి ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణి, హసీనా, పైడేశ్వరీ పాల్గొన్నారు.