VSP: ఇటీవల గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతి రాజుతో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ గోపాల్ భేటీ అయ్యారు. సోమవారం ఆయన విజయనగరంలోని అశోక్ బంగ్లాకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గజపతి రాజుకు వివరించారు.