సత్యసాయి: రామగిరి మండలంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలం, గ్రామ స్థాయిలో పార్టీ విస్తరణపై ఆయన కూలంకషంగా చర్చించారు. ఈ శిక్షణ తరగతుల్లో మండల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.