CTR: చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ పుట్టపర్తి నారాయణ చార్యులు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన 15 భాషల్లో ప్రావీణ్యం సాధించడం అరుదైన విషయమని కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు.