VZM: గృహ నిర్మాణాలు వేగవంతం చెయ్యాలని మన్యం జిల్లా డీఆర్డివో పీడీ సుధారాణి తెలిపారు. మన ఇల్లు- మన గౌరవం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్నా గృహాలను పరిశీలించారు. ఇల్లు లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా అదనపు సహాయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.