సత్యసాయి: పెనుకొండ పట్టణంలో ఆర్అండ్బి గెస్ట్ హౌస్లో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సమక్షంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ సోమవారం ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సీపీఐ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు సమక్షంలో ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.