పార్వతీపురం మండలం అడ్డాపుశీల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాంబాబు (30) అనే యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న రాంబాబును ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.