VZM: విజయనగరం 2వ వార్డు పరిధిలో పూల్భాగ్ కాలనీ ప్రాంతానికి చెందిన దాదాపు 70 కుటుంబాలు బుధవారం స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు సమక్షంలో టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 2వ వార్డుకి వచ్చిన ఆమె వారికి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ది జరుగుతుందన్నారు.