»Bharatanatyam Dancing To Reach Tirumala Within 75 Minutes
Tirumala: నాట్యం చేస్తూ 75 నిమిషాల్లోనే తిరుమలకు
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. మరికొంత మంది వారి మొక్కులను బట్టి పలురకాలుగా వెళ్లడం చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాజాగా నాట్యం చేస్తూ వెళ్లారు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా తిరుమల(Tirumala)కు అయితే అనేక మంది కాలీ నడకన వెళ్తారు. మరికొంత మంది మొక్కుకున్న వారు మొకాళ్ల మీద కూడా మెట్ల మార్గంలో వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొంత మంది మెట్లకు బొట్లు పెట్టుకుంటూ స్వామి దర్శనానికి వెళ్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం సరికొత్తగా భరతనాట్యం(bharatanatyam) చేస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆ వివరాలను ఇప్పుడు చుద్దాం.
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన భరతనాట్య కళాకారుడు డాక్టర్ పీ కృష్ణవాసు శ్రీకాంత్ శ్రీవారి మెట్ల మార్గంలో భరతనాట్యం చేస్తూ 75 నిమిషాల్లోనే(75 minutes) తిరుమల చేరారు. మాములుగా అయితే ఆ మార్గంలో నడుచుకుంటూ వెళితే దాదాపు గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అదే సమయంలో శ్రీకాంత్ నాట్యం(dance) చేస్తూ వెళ్లడం విశేషం. నృత్యం ప్రాముఖ్యత గురించి ఎక్కువ మందికి తెలిసేందుకే ఇలా చేసినట్లు అతను చెబుతున్నారు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలకు నృత్యం చేస్తూ తిరుమల చేరుకున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. అంతేకాదు పల్నాడులోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠ కోటప్పకొండ విద్యాలయంలో సంస్కృత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.