NLR: మాజీ మంత్రి కాకాణి ఇంటి వద్ద బుధవారం రాత్రి ఉత్కంఠ నెలకొంది. ఆయనపై నమోదైన పలు కేసుల నేపథ్యంలో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో ఆయన ఇంటి వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరోవైపు ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఆయన ఇంటి వద్దే ఉంటూ పరిస్థితి గమనిస్తున్నట్లు సమాచారం.