PLD: వినుకొండ పట్టణంలో ఇళ్ల స్థలాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ చంద్రబోస్ తెలిపారు. వినుకొండలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు పెరగటం వలన, దోమలవ్యాప్తితోపాటు, విష సర్పాల బెడద పెరిగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి భంగం వాటిల్లుతుందని, ఖాళీ ప్రదేశం ఉన్నవారు పరిశుభ్రంగా ఉంచుకొవాలన్నారు.