TPT: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11వ తేదీన జాతర, 12న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.