KDP: చాపాడు మండలం అన్నవరం గ్రామపంచాయతీ చండ్లూరు గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈతకు వెళ్లి గల్లంతైన షేక్ ఆదిల్ (18) మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని బావి నుంచి బుధవారం ఉదయం పోలీసుల సహాయంతో ఈతగాళ్లు బయటకి తీశారు. తోటి స్నేహితులతో ఈతకి వెళ్లి ఆదిల్ ఒక్కడే బావిలో దూకడంతో మృత్యువాత పడినట్లు చాపాడు పోలీసులు తెలియజేశారు.