PLD: వినుకొండ నియోజకవర్గ ముస్లిం ప్రజలకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పవిత్ర రంజాన్ ఈద్-అల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌహార్దత, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఈ పవిత్ర పండగ సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు. అలాగే, ముస్లింలు ప్రశాంత వాతావరణంలో పండగను జరుపుకోవాలని సూచించారు.