ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి సంస్కరణ సభలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. శ్రేయోభిలాషులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో హనుమంతరాయ చౌదరి చేసిన కృషిని కొనియాడారు.