ATP: డీఎస్పీ విజయ్ కుమార్ శనివారం అమడగూరు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తు పురోగతిపై అధికారులతో చర్చించారు. అనంతరం నల్లమడ, ఓడీసీ, అమడగూరు స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లతో సమావేశమై లోక్ అదాలత్ కేసుల స్థితిగతులపై ఆరా తీశారు.